Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Feb 2024 20:59 IST

1. షరతులు అంగీకరిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత.. అసెంబ్లీ తీర్మానం

రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించేది లేదని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హరీశ్‌ కాంగ్రెస్‌లోకి రావాలి.. పాపాలు కడుక్కోవడానికి దేవాదాయశాఖ ఇస్తాం: రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌గా మాట్లాడారు. భారాసలో ఉన్నా హరీశ్‌కు ప్రయోజనం లేదని.. కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని చెప్పారు. ఇందుకు 25 మంది భారాస ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు. అప్పుడు ఆయనకు దేవాదాయశాఖ ఇస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏడో జాబితాపై కసరత్తు.. సీఎం జగన్‌తో బాలినేని, వల్లభనేని, కొడాలి నాని చర్చలు!

వైకాపాలో పలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్‌ఛార్జుల మార్పు కొనసాగుతోంది. పలు మార్పులతో ఏడో జాబితాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వయోపరిమితి పెంపు

పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. జనరల్ కేటగిరీలో వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత  2015లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఫేక్‌.. ఫాలో కావొద్దు: సీబీఎస్‌ఈ హెచ్చరిక

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న వేళ  CBSE బోర్డు విద్యార్థులకు కీలక హెచ్చరికలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో సీబీఎస్‌ఈ లోగో, పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే నకిలీ హ్యాండిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పేటీఎంపై ఆంక్షలు.. ‘రివ్యూ’కు ఛాన్స్‌ లేదన్న ఆర్‌బీఐ..!

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)పై ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం స్పందించారు. పేటీఎంపై చర్యలను తాము సమీక్షించాలనుకోవడం లేదని తేల్చిచెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజ్యసభకు సోనియా.. రాయ్‌బరేలీ నుంచి బరిలో ప్రియాంక ?

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్‌ కాబోతున్నారంటూ ఊహాగానాలు వినబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నుంచి వైదొలిగి తన కుమార్తె ప్రియాంకాగాంధీని రంగంలోకి దించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సిసోదియాకు స్వల్ప ఊరట.. వివాహానికి హాజరయ్యేందుకు బెయిల్

ఆప్‌ సీనియర్ నేత మనీశ్‌ సిసోదియాకు స్వల్ప ఊరట లభించింది. సోమవారం దిల్లీ కోర్టు ఆయనకు మూడు రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరుచేసింది. తన తోబుట్టువు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు నుంచి ఈ ఉపశమనం దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అయోధ్యలో కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌.. బాలరాముడిని దర్శించుకున్న సీఎంలు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ సోమవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్ కూడా వెళ్లారు. వీరిద్దరూ కుటుంబసమేతంగా ఆ నగరంలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేజ్రీవాల్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డీప్‌ఫేక్‌ ఎఫెక్ట్‌.. ‘ఏఐ వాయిస్‌ రోబోకాల్స్‌’పై అమెరికా నిషేధం

ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ-ఆధారిత ఫోన్‌కాల్స్‌ను సృష్టించి తప్పుడు ప్రచారానికి తెర తీశారు. దీంతో అప్రమత్తమైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏఐ- ఆధారిత వాయిస్‌ రోబోకాల్స్‌’పై నిషేధం విధించింది. ఈమేరకు ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని