Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2024 21:14 IST

1. ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ

దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి

భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 30న హస్తం పార్టీలో చేరనున్నట్లు విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్‌.. తరిమికొట్టడం జగన్‌ బ్రాండ్‌: చంద్రబాబు

రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం రాత్రి సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన ప్రజాగళం రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. ‘‘తెదేపా హయాంలో సీమలో రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. కియా వంటి పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్‌.. పరిశ్రమలు తరిమికొట్టడం జగన్‌ బ్రాండ్‌’’ అని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్‌ బోర్డు

తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్‌ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఇంటర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌ ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్న ఆయన.. అగ్నివీర్‌ పథకంపై వస్తోన్న విమర్శలతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్‌ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల ముంగిట భారతదేశపు సంపన్న మహిళ, హరియాణా మాజీ మంత్రి సావిత్రి జిందాల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. హస్తం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. గురువారం సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా

ఇద్దరూ ప్రముఖ వ్యాపార వేత్తలు. దేశంలో అత్యంత ధనవంతులు. పైగా గుజరాత్‌ నుంచి వచ్చిన వారే. వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీ తొలిసారి చేతులు కలిపారు. అదానీకి చెందిన ఓ పవర్‌ ప్రాజెక్ట్‌లో రిలయన్స్‌ తాజాగా 26 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా కుబేరుల మధ్య తొలిసారి వ్యాపార భాగస్వామ్యం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల స్కామ్‌.. రూ.32.34 కోట్లు అటాచ్‌

పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల స్కామ్‌లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ ) తెలిపింది. పార్ట్‌ టైమ్‌ జాబ్‌ల పేరుతో జరిగిన మోసాలపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో 50కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మస్క్‌ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ!

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ యూజర్లకు ఎలాన్‌ మస్క్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. 2,500కు పైగా వెరిఫైడ్‌ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. 5 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ‘ఎక్స్‌’ యూజర్లకు ప్రీమియం ప్లస్‌ సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్‌!

భారత్‌తో వాణిజ్య సంబంధాలపై పాకిస్థాన్‌ మాట మార్చింది. వీటి పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన దాయాది దేశం.. తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని తాజాగా ప్రకటించింది. దానిని పునరుద్ధరించే ప్రణాళిక లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని