Congress: కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి

భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Updated : 28 Mar 2024 20:03 IST

హైదరాబాద్‌: భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 30న హస్తం పార్టీలో చేరనున్నట్లు విజయలక్ష్మి స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని పేర్కొన్నారు.

‘‘కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నాను. గతంలో సుదీర్ఘ కాలం ఆ పార్టీలోనే ఉన్నా. కేసీఆర్‌ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. పార్టీ అంశాలు, కవిత అరెస్టుపై కేసీఆర్‌తో చర్చించా. కవితను అక్రమంగా అరెస్టు చేశారు’’ అని కేకే తెలిపారు. తాను మాత్రం భారాసలోనే కొనసాగుతానని కేకే కుమారుడు విప్లవ్‌ కుమార్‌ తెలిపారు. తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని