Inter Board: మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్‌ బోర్డు

తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.

Published : 29 Mar 2024 00:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్‌ కాలేజీలకు ఈ విద్యాసంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఇంటర్‌ కళాశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను బేఖాతరు చేస్తూ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని