Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 02 Mar 2024 13:00 IST

1. ట్రాక్టర్‌తో తొక్కించి ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది: లోకేశ్‌

మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను వైకాపా సర్పంచి అనుచరుడు ట్రాక్టరుతో ఢీకొట్టి చంపేసిన ఘటనపై లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తి కథనం

2. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

వైకాపాకు మరో షాక్‌ తగిలింది. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెదేపాలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.పూర్తి కథనం

3. ‘ఆ పోస్టు డిలీట్‌ చేసి, క్షమాపణలు చెప్పండి’: కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి నోటీసు

తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపారు.పూర్తి కథనం

4. పరీక్షల సమయం.. ఫోన్‌కు ఇచ్చేద్దాం విరామం!

అసలే ఇది పరీక్షల కాలం. పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుతున్నా.. మధ్యమధ్యలో ఫోను పట్టుకోకుండా ఉండలేరు. ఏదో డౌట్‌ ఉందనో, మెటీరియల్‌ కావాలనో, ఫ్రెండ్స్‌ ఎలా చదువుతున్నారో తెలుసుకోవాలనో అలా ఫోన్‌ తీయడం.. తీరా దాంతోనే కాలక్షేపం చేయడంతో తెలీకుండానే సమయం వృథా అయిపోతుంటుంది.పూర్తి కథనం

5. గాజాలో ఆకలి కేకలు.. బైడెన్‌ కీలక నిర్ణయం

ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో గాజా (Gaza)లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న అమాయకులపై ఐడీఎఫ్‌ కాల్పులు జరపడం యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది.పూర్తి కథనం

6. ‘రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి’: భాజపా అధ్యక్షుడికి గంభీర్‌ అభ్యర్థన

భాజపా ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని శనివారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించారు. దాంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరం కానున్నారని తెలుస్తోంది.పూర్తి కథనం

7.మహిళల విజయానికి విలువకట్టేది ఇలాగేనా? సానియా మీర్జా పోస్ట్‌ వైరల్‌ 

సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్నదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు భారత టెన్నిస్‌ (Tennis) స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza). స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్‌పై స్పందిస్తూ ఆమె సోషల్‌మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.పూర్తి కథనం

8.ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ ఇషాన్‌ను బీసీసీఐ సంప్రదించిందా..?

టీమ్‌ఇండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ వ్యవహారశైలిపై బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కూ పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతోనే సెంట్రల్‌ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.పూర్తి కథనం

9. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం: గోరంట్ల బుచ్చయ్య

సీఎం జగన్‌ను సాగనంపాలని ఏపీ ప్రజలంతా కోరుకుంటున్నారని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని గద్దె దించి ఏపీని రక్షించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు పూర్తి కథనం

10. ఓటర్ల జాబితాలో అక్రమాలు.. అన్నీ ఇన్నీ కావు: నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్షా సమయమని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని.. పార్టీ, ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటుచేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని