Top Ten News 1 PM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

ఈనాడు. నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 04 Apr 2024 13:00 IST

1. హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యల దుమారం.. వివాదంలో మరో కాంగ్రెస్ నేత

ఎంపీ, నటి హేమమాలిని (Hema Malini) పై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై భాజపా ఆక్షేపణ వ్యక్తంచేసింది. మహిళలను కించపర్చారంటూ ఒక వీడియోను పోస్టు చేసింది. ‘‘కాంగ్రెస్‌ ఎంపీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అవి హేమమాలినిజీనే కాకుండా మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్’’ అని భాజపా ప్రతినిధి అమిత్‌ మాలవీయ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

2. మా కంటే సాఫ్ట్‌వేర్‌నే ఎక్కువ నమ్ముతున్నారు.. విస్తారా పైలట్ల ఆందోళన!

కొంతమంది పైలట్లు సమ్మెబాట పట్టడంతో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు విస్తారా (Vistara) చర్యలు చేపట్టింది. బుధవారం ఈ మేరకు వారితో చర్చించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వినోద్‌ కన్నన్‌ సహా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారని వెల్లడించాయి. ఈ సందర్భంగా పైలట్లు తమ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

3. సొంతవాళ్లే ఓటెయ్యలేదు.. ఒక్క ఓటుతో ఓడిపోయారు..!

ప్రజాస్వామ్య ఎన్నికల (Elections) ప్రక్రియలో ప్రతి ఓటరూ కీలకమే. ఒక్క ఓటే (Vote) కదా అని తేలిగ్గా తీసుకుంటే ఫలితం తారుమారవడం ఖాయం అది. కొందరి విషయంలో అది అక్షరాలా నిజమైంది..! మన దేశ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అలా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క ఓటు (Single Vote) తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదీనూ వారి సొంతవాళ్లే ఓటును హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం..! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

4. నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్‌కు అంగీకరించను: బోనీ కపూర్

ఒకప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు అగ్ర కథానాయిక దివంగత నటి శ్రీదేవి (Sridevi). ఆమె బయోపిక్‌ రానున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె భర్త బోనీ కపూర్‌ స్పందించారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో ఈ బయోపిక్‌ గురించి మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

5. కేజ్రీవాల్‌ అంశంలో మాకు పక్షపాతం లేదు: వివరణ ఇచ్చిన అమెరికా

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనుకూల వైఖరి తీసుకొందన్న విమర్శలకు అమెరికా (USA) విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ అనుకూలం కాదని.. ప్రతి ఒక్కరిని చట్టప్రకారం సమానంగా చూడాలని, మానవ హక్కుల విషయంలోనే మాట్లాడతామని పేర్కొన్నారు. మాథ్యూ మిల్లర్‌ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విషయంలో మాట్లాడతారు గానీ, పాక్‌లో ప్రతిపక్ష నేతల అరెస్టులపై మాత్రం మౌనంగా ఉంటారనే విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు బుధవారం నేరుగా ఆయన వద్దే ప్రస్తావించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

6. ఈసారి జట్టుకూ ఫైన్‌.. రిషభ్‌ పంత్‌కు జరిమానా డబుల్‌!

వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో దిల్లీ జట్టుకు ఓటమి ఎదురైంది. కోల్‌కతా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 166 పరుగులకే పరిమితమైంది. ఇప్పటి వరకు దిల్లీ నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న దిల్లీకి ఐపీఎల్‌ షాక్‌ ఇచ్చింది. కోల్‌కతాతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మళ్లీ దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు, జట్టులోని సభ్యులకూ జరిమానా విధించింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

7. కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (US Elections) సంబంధించి ఓ కీలక ఒపీనియన్‌ పోల్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కంటే రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకే (Donald Trump) మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం లభించనున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

8. మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు, భూములు.. రాహుల్‌ గాంధీకి రూ.20కోట్ల ఆస్తులు

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. బుధవారం నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ (Nomination) పత్రాలు సమర్పించారు. అందులో తన నికర సంపద రూ.20కోట్లుగా వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

9. ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్‌

అడుగు పెట్టిన అన్ని రంగాల్లోనూ విజయం సాధించారు నటుడు మురళీమోహన్‌ (Murali mohan). కష్టాన్ని నమ్ముకున్న ఆయన్ని కళామతల్లి అక్కున చేర్చుకొని ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దింది. మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయనతో పాటు ఆయన కోడలు మాగంటి రూప కూడా ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

10. తెరపైకి ఉదండాపూర్‌ పునరావాస అంశం.. ఎన్నికల బహిష్కరణకు సిద్ధమైన భూనిర్వాసితులు 

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉదండాపూర్ నిర్వాసితుల పునరావాసం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమగోడు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని ఎన్నికలు బహిష్కరించేందుకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్న ఉదండాపూర్ పునరావాస సమస్యలపై ప్రత్యేక వీడియో..  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని