TS High Court: శంషాబాద్‌లో 181 ఎకరాల భూ వివాదం.. హైకోర్టు కీలక తీర్పు

శంషాబాద్‌లోని రూ.కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించి గురువారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

Updated : 16 Dec 2023 20:19 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రూ.కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించి గురువారం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శంషాబాద్‌లో కబ్జాకు గురైన 181 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏదేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భూ ఆక్రమణదారుల పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. దీనిపై నవంబరు 18న తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెల్లడించింది. శంషాబాద్‌ భూముల వివాదంపై హైకోర్టులో దాదాపు ఏడాది పాటు వాదనలు సాగాయి. తప్పుడు రికార్డులతో కబ్జాకు యత్నించారని హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వాదించారు. భూములు హెచ్‌ఎండీఏకి చెందినవేనని పూర్తి ఆధారాలు సమర్పించారు. ఏడాది వాదనల తర్వాత హెచ్‌ఎండీఏకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని