TS News: విజయ డెయిరీపాల ధర పెంపు

తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై........

Updated : 31 Dec 2021 16:48 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్‌ మిల్క్‌పై రూ.2లు చొప్పున పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ వెల్లడించింది. అలాగే, లీటరు హోల్‌ మిల్క్‌పైనా రూ.4ల చొప్పున పెంచింది. పెంచిన ఈ ధరలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలను పెంచుతున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ధరలు పెరిగిన దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని