ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
వరుడు ఫొటోలో చూసినట్లు లేడని వివాహానికి నిరాకరిస్తూ పెళ్లి కుమార్తె మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన బిహార్‌లో జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లా బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన...
పాట్న: ఫొటోలో చూసినట్లు వరుడు లేడని వివాహానికి నిరాకరిస్తూ పెళ్లి కుమార్తె మండపం నుంచి వెళ్లిపోయిన ఘటన బిహార్‌లో జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లా బైరియాలోని తదీవానందపుర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ అనే యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వాట్సాప్‌లో పంపిన యువకుడి ఫొటో చూసిన యువతి పెళ్లికి సరేనంది. దీంతో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సపరివారసమేతంగా వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఎదురైంది. తాళి కట్టబోయే ముందు వరుడిని చూసిన వధువు.. ఫొటోలో చూసినట్లు లేడని, అతడిని పెళ్లి చేసుకోనంటూ మండపం నుంచి దూరంగా పారిపోయింది. ఆమెకు నచ్చజెప్పేందుకు పెళ్లి పెద్దలంతా విఫలయత్నం చేశారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు వరుడు పెళ్లి కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?