Kadapa: వాడీవేడిగా జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రులు, జిల్లా కలెక్టర్‌ను వైకాపా జడ్పీటీసీలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. పలు సమస్యలను లేవనెత్తుతూ.. వివిధ శాఖల ఇబ్బందులను ప్రస్తావించారు.

Published : 30 Jan 2023 16:49 IST

కడప: ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మంత్రులు, జిల్లా కలెక్టర్‌ను వైకాపా జడ్పీటీసీలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. పలు సమస్యలను లేవనెత్తుతూ.. వివిధ శాఖల ఇబ్బందులను ప్రస్తావించారు. జిల్లాలో ప్రభుత్వ భవనాలు, సచివాలయ భవనాలు, ఆర్బీకేలు, రోడ్లు తదిరత నిర్మాణాలు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడం లేదని జడ్పీటీసీ సభ్యులు రఘునాథరెడ్డి, శివప్రసా ద్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. బిల్లులు చెల్లించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నారు. వేదికపై ఉన్న మంత్రులు తమ సమస్యలు పట్టించుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులకు గౌరవం కరువైందని పంచాయతీరాజ్‌ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి విమర్శించారు. దీనిపై స్పందించిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రజాప్రతినిధులను గౌరవించాలన్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని