Amit Shah: కంట్రోల్‌ తప్పిన హెలికాప్టర్‌.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం

Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది.

Published : 29 Apr 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ (Helicopter) టేకాఫ్‌ సమయంలో కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. బిహార్‌ (Bihar)లోని బెగుసరయ్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

బెగుసరయ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్‌ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే, టేకాఫ్‌ అవుతుండగా అది నియంత్రణ కోల్పోయి కుడివైపు దిశగా ఊగిసలాడింది. ఒక దశలో నేలను తాకబోయింది. అప్రమత్తమైన పైలట్‌ వెంటనే హెలికాప్టర్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడంతో అది నిర్ణీత మార్గంలో బయల్దేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు

గతవారం కూడా అమిత్ షా హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా కిందకు దిగలేకపోయింది. ఏప్రిల్‌ 21న పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు కేంద్ర మంత్రి వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ విఫలమైంది. దీంతో ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని