ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి

ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది.

Published : 06 May 2024 03:16 IST

రాష్ట్రాలకు కేంద్రం సూచన

దిల్లీ: ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఏటా ప్రతి 10 లక్షల జనాభాలో ఒకరు కన్నా తక్కువ సంఖ్యలో అవయవదాతలు ఉంటున్నారని తెలిపింది. దీన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్రాలకు తాజా సూచనలిచ్చింది. ‘‘బ్రెయిన్‌ డెడ్‌ కేసులు చాలా ఉన్నప్పటికీ వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడం పెద్ద సవాల్‌గా మారింది’’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ సంచాలకుడు అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. మానవ అవయవాల మార్పిడి చట్టం-1994లోని నిబంధనల ప్రకారం జీవన్మృతుడయ్యే అవకాశమున్న రోగులను ఐసీయూల్లో తొలుత గుర్తించాలి. ఆ తర్వాత ఇలాంటివారు అవయవదానాలకు హామీ ఇచ్చారా అన్నది పరిశీలించారు. ఒకవేళ ఇవ్వకుంటే రోగి కుటుంబ సభ్యులకు దీనిపై అవగాహన కల్పించాలి. బాధితుడి గుండె ఆగేలోగా ఆ పనిచేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని