పాఠశాలలో ఏసీ సదుపాయం ఖర్చు తల్లిదండ్రులే భరించాలి

విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది.

Published : 06 May 2024 05:07 IST

దిల్లీ హైకోర్టు వ్యాఖ్య

దిల్లీ: విద్యార్థులకు పాఠశాలలో కల్పించే ఎయిర్‌ కండిషన్‌ (ఏసీ) సదుపాయం ఖర్చును వారి తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ప్రయోగశాలల రుసుములను చెల్లిస్తున్న విధానమే దీనికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక ప్రైవేటు పాఠశాల నెలకు రూ.2వేల మొత్తాన్ని ఏసీ తరగతి గదుల ఖర్చు కింద ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ అరోడా ధర్మాసనం విచారణ జరిపింది. విద్యార్థుల సదుపాయాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తల్లిదండ్రులు భరించాల్సిందేనని, పాఠశాల యాజమాన్యంపై ఆ భారం మొత్తాన్నీ వేయలేమని ధర్మాసనం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని