Corona Compensation: ఆత్మహత్య చేసుకున్నా కరోనా పరిహారం

కొవిడ్‌-19 పాజిటివ్‌ నివేదిక వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆత్మహత్య

Updated : 24 Sep 2021 07:34 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌-19 పాజిటివ్‌ నివేదిక వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం ప్రమాణపత్రం దాఖలుచేసింది. ‘‘కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద పరిహారం పొందడానికి అర్హులే. ఈమేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చు’’ అని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు ప్రమాణపత్రంలో పేర్కొంది. ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతిచ్చినట్లు కేంద్రం బుధవారం కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఇది ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ వర్తించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు