Shigella virus: కేరళలో మరోసారి షిగెల్లా కలకలం..కోజికోడ్‌లో తొలి కేసు

కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్‌ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని,

Published : 29 Apr 2022 07:14 IST

కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్‌ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలినట్లు వివరించారు. బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు. శరీరంలోకి షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది.  
వ్యాధి లక్షణాలు: జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు. కలుషిత నీరు, పాడైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువ. వ్యక్తిగత శుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని మాత్రమే తాగడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధికి దూరంగా ఉండొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని