ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే శ్రీనివాస్‌ను విచారించిన ఎన్‌సీబీ

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త డి.కె.శ్రీనివాస్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సదాశివనగరలోని ఆయన

Published : 26 May 2022 05:45 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త డి.కె.శ్రీనివాస్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కెంపేగౌడ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సదాశివనగరలోని ఆయన నివాసానికి తీసుకొచ్చి సోదాలు జరిపారు. అనంతరం యలహంకలోని ఆయన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని దస్త్రాలను స్వాధీనపరచుకున్నారు. పలు ప్రశ్నలు సంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. మాదక ద్రవ్యాలను వినియోగించడంతో పాటు ఇతరులకు కూడా దానిని ఇచ్చినట్లు శ్రీనివాస్‌పై అభియోగాలు ఉండడంతో ఎన్‌సీబీ అధికారులు విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని