అందుబాటులోకి అగ్నిపథ్‌

రక్షణశాఖ పరిధిలోని త్రివిధ దళాలలకు సంబంధించిన సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ‘అగ్నిపథ్‌’ కార్యక్రమాన్ని... కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ఈ ఏడాది సుమారు 46 వేల మందిని నియమించనుంది.

Updated : 15 Jun 2022 04:45 IST

ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరుల నియామకం
 రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: రక్షణశాఖ పరిధిలోని త్రివిధ దళాలలకు సంబంధించిన సైనిక నియామకాల నిమిత్తం రూపొందించిన ‘అగ్నిపథ్‌’ కార్యక్రమాన్ని... కేంద్ర ప్రభుత్వం మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ఈ ఏడాది సుమారు 46 వేల మందిని నియమించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్‌సింగ్‌.. త్రివిధ దళాధిపతుల సమక్షంలో విలేకరులకు వెల్లడించారు. అగ్నివీరుల నమోదు ప్రక్రియను మూడు నెలల్లో కేంద్రీకృత ఆన్‌లైన్‌ ద్వారా చేపడతారు. ఇందుకోసం ప్రత్యేక ర్యాలీలు, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నమోదు ప్రక్రియ ‘ఆల్‌ ఇండియా- ఆల్‌ క్లాస్‌’ ప్రాతిపదికన ఉంటుంది. అభ్యర్థులు వైద్య అర్హతలు సాధించాల్సి ఉంటుంది.కాగా, నాలుగేళ్ల తర్వాత ఈ అగ్నివీరులను ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

బీమాతో భరోసా... : అగ్నివీరులుగా చేరినవారికి నాలుగేళ్లపాటు నెలవారీ జీతం, నాలుగేళ్ల తర్వాత సేవానిధి కింద రూ.11.71 లక్షల ఏకమొత్తం అందిస్తారు. ఈ కార్యక్రమంలో చేరినవారు ఏ కారణంతోనైనా చనిపోతే రూ.48 లక్షల జీవిత బీమా అందజేస్తారు. విధుల్లో మరణిస్తే రూ.44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. పనిచేయని మిగిలిన కాలానికి జీతభత్యాలతో పాటు సేవానిధి మొత్తాన్ని కూడా వారి కుటుంబాలకు ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అంగవైకల్యం పొందితే దాని నిష్పత్తి ప్రకారం పరిహారం చెల్లిస్తారు. 100/75/50 శాతం అంగవైకల్యానికి గురైనవారికి వరుసగా 44/25/15 లక్షల రూపాయల పరిహారాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని