తమిళ నిర్మాతలపై ఐటీ దాడులు

తమిళనాట సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు చేసిన ఆదాయపన్ను విభాగం అధికారులు దాదాపు రూ. 200 కోట్లకు పైగా లెక్కచూపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత

Updated : 23 Nov 2022 10:52 IST

డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలోనూ సోదాలు
రూ.200 కోట్లకు పైగా స్వాధీనం

చెన్నై(సైదాపేట), న్యూస్‌టుడే: తమిళనాట సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు చేసిన ఆదాయపన్ను విభాగం అధికారులు దాదాపు రూ. 200 కోట్లకు పైగా లెక్కచూపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత అన్బుసెళియన్‌, మరికొందరి ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు ఈనెల 2 నుంచి సోదాలు చేస్తున్నారు. మొత్తం 40 చోట్ల చేసిన తనిఖీల్లో రూ.26 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు.. లెక్కచూపని రూ.200 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్‌ పరికరాలలో నగదు లావాదేవీలు, రహస్య పెట్టుబడుల వివరాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. సినిమాలు విడుదలైనప్పుడు వచ్చిన డబ్బు.. లెక్కల్లో చూపినదాని కంటే ఎన్నోరెట్లు ఉందని, దాంతో పన్ను ఎగవేత స్పష్టంగా తెలుస్తోందన్నారు. వాటిని లెక్క చూపకుండా పెట్టుబడుల్లో పెడుతున్నట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్వాధీనం చేసుకున్న సొమ్ము థియేటర్ల నుంచి వచ్చిన వసూళ్లుగా తెలుస్తోందన్నారు. వీరు సిండికేట్‌గా మారి థియేటర్ల వసూళ్లను తొక్కిపెట్టారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని