
Published : 27 Jan 2022 22:08 IST
Corona: కేంద్ర విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్
దిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జైశంకర్ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ యెస్లే డ్రియాన్‌తో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లో భారత్‌కు ఉన్న అవకాశాలపై ఆయనతో చర్చించారు.
మరోవైపు, దేశంలో కొవిడ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ ఒక్కరోజే 2.86 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రాగా.. 573 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి
Tags :