Central Govt: ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు మార్చుతారా? కేంద్రం ఏం చెప్పిందంటే..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ (Retirement age) అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పింది.

Published : 09 Aug 2023 15:04 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ (Retirement age) అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని చెప్పింది. వివిధ సర్వీసు నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్‌.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు

‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును (Retirement age) మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు’ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. పాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా డిజిటలీకరణ, ఈ-ఆఫీస్‌ను సమర్థవంతంగా వినియోగించడం, నిబంధనలు సరళతరం చేయడం, అనవసర చట్టాలను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

వారికి 730 రోజుల సంరక్షణ సెలవులు

సివిల్‌ సర్వీసెస్‌, కేంద్ర ప్రభుత్వశాఖల్లో పనిచేసే మహిళలు, ఒంటరి పురుష ఉద్యోగుల పిల్లల సంరక్షణ (CCL) కోసం తమ మొత్తం సర్వీసులో గరిష్ఠంగా 730 రోజులు సెలవులు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఉద్యోగుల పిల్లల్లో ఇద్దరు తొలి సంతానానికి 18ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ అర్హత ఉంటుందని.. అదే దివ్యాంగ పిల్లలకు మాత్రం వయసు పరిమితి లేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని