ఎన్నికల వేళ.. అయోధ్య రామయ్యను దర్శించుకున్న మోదీ (వీడియో)

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ మరోసారి రామమందిరాన్ని సందర్శించారు. 

Published : 05 May 2024 21:55 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రచార పర్వంలో తలమునకలయ్యారు. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఝార్ఖండ్‌, బిహార్‌లలో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ.. సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. రామమందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరిలో అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ‘బాలక్‌ రామ్‌’ను మోదీ దర్శించుకోవడం ఇదే తొలిసారి. అనంతరం స్థానికంగా నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. 

సుగ్రీవ కోట నుంచి లతా చౌక్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో కొనసాగింది. మోదీ పర్యటన నేపథ్యంలో నగరమంతా ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కటౌట్‌లతో నిండిపోయింది. ఒకవైపు ఆదివారం కావడం, మరోవైపు ప్రధాని రాక నేపథ్యంలో అయోధ్యకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ స్థానానికి లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని