Threat Mails: పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్‌ నుంచి మెయిల్స్‌..!

నేడు గుజరాత్‌లోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దాంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.  

Published : 06 May 2024 13:14 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ రాజధాని నగరం దిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన మరువకముందే.. మరోసారి అలాంటి ఘటనే వెలుగుచూసింది. సోమవారం ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలు సంఖ్యలో స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్‌ (Threat Mails) వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. వెంటనే తనిఖీలు నిర్వహించగా.. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

గత బుధవారం దిల్లీలోని 100కు పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే రాగా.. ఆ రోజు కొన్ని చోట్ల పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపించేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గుజరాత్‌ పాఠశాలలకు వచ్చిన బెదిరింపు మెయిల్స్‌.. రష్యన్ డొమైన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. దిల్లీ ఘటనకు కూడా ఇదే కారణమని సమాచారం. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని