Acharya:‘ఆచార్య’ హిందీ ట్రైలర్‌ వస్తుందా?

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’(Acharya).

Published : 12 Apr 2022 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’(Acharya). రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌, పూజాహెగ్డే కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. సాయంత్రం 5.49కి థియేటర్‌లలో తెరపై చూపించనుండగా, రాత్రి 7.02 గంటలకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేయనున్నారు.

తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో పెన్‌ స్టూడియోస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హిందీ ట్రైలర్‌ కూడా విడుదల అవుతుందా? లేదా అన్న సందిగ్ధత నెలకొంది. చిత్ర బృందం సైతం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడంతో ఎప్పుడు విడుదల చేస్తారన్న ఆసక్తి మొదలైంది. ఇటీవల పాన్‌ ఇండియా సినిమాలకు సంబంధించిన ట్రైలర్‌లన్నీ ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. కొన్ని సినిమాలు మాత్రం తొలుత మాతృ భాషలో విడుదల చేసి, ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ఇతర భాషల్లో తీసుకొస్తున్నారు. ‘ఆచార్య’కు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని