Allu Arjun: ‘పుష్ప 3’ సన్నాహాలు

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇదింకా చిత్రీకరణ దశలో ఉండగానే ‘పుష్ప 3’ కూడా ఉండనుందనే వార్తలొచ్చాయి.

Updated : 18 Feb 2024 03:21 IST

ల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇదింకా చిత్రీకరణ దశలో ఉండగానే ‘పుష్ప 3’ కూడా ఉండనుందనే వార్తలొచ్చాయి. దీనిపై అల్లు అర్జున్‌ జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్‌ చలన చిత్రోత్సవాల్లో స్పందించారు. ‘‘పుష్ప’ని మేము ఫ్రాంచైజీగా మార్చాలని అనుకుంటున్నాము. ఆ లైనప్‌ కోసం మా దగ్గర కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా మీరు ‘పుష్ప 3’ని ఆశించవచ్చు’’ అని వెల్లడించారు. అనంతరం ‘పుష్ప 2’ గురించి మాట్లాడుతూ.. ‘‘తొలి భాగంతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు.. వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటాయి. పుష్పరాజ్‌ను క్యారెక్టరైజేషన్‌ పరంగా.. స్కేల్‌ పరంగా.. ప్రజెంటేషన్‌ పరంగా చాలా ఎక్కువ స్థాయిలో చూస్తారు. కచ్చితంగా ఇది అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రం తర్వాత చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు వరసలో ఉన్నాయి. కచ్చితంగా అవన్నీ భారీ స్థాయిలోనే ఉంటాయి’’ అన్నారు. ఈ బెర్లిన్‌ చిత్రోత్సవాల్లో ‘పుష్ప: ది రైజ్‌’ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇక ‘పుష్ప 2’ విషయానికొస్తే.. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంట్లో రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని