Aliabhatt: రాజమౌళిని అన్‌ఫాలో చేసిన ఆలియా.. నిజమెంత..?
ఆలియా ఆగ్రహానికి గురైందా..?
ఇంటర్నెట్‌డెస్క్: రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బాలీవుడ్ నటి ఆలియాభట్. అయితే.. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆలియా.. రాజమౌళిపై ఆగ్రహంగా ఉన్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత..?
‘ఆర్ఆర్ఆర్’లో సీతగా నటించి మెప్పించారు ఆలియా. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా ఓ కీలకపాత్ర పోషించారు. అసలైన కథ కూడా ఈమె ద్వారానే రివీల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. సినిమా విడుదలైన తర్వాత స్క్రీన్‌స్పేస్ విషయంలో ఆలియా అసంతృప్తి చెందారనీ.. ఒలీవియాతో పోలిస్తే తన పాత్ర చాలా తక్కువగా ఉందని ఆమె ఫీలయ్యారనీ.. ఆ కోపంతోనే ఇన్‌స్టా వేదికగా రాజమౌళిని అన్‌ఫాలో చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను సైతం ఆమె ఇన్‌స్టా నుంచి తొలగించిందని ఆ వార్తల్లో రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే.. ఆ వార్తలు వాస్తవం కాదు. ఎందుకంటే ఆమె ఇన్‌స్టా ఖాతాని చెక్ చేస్తే.. ఆమె ఫాలో అయ్యే 475 మందిలో రాజమౌళి, తారక్, చరణ్ ముగ్గురూ ఉన్నారు. అలాగే ఆమె ఖాతాలో ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్లు, రాజమౌళితో సెట్స్‌లో దిగిన ఫొటోలు అన్నీ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..