Published : 13 May 2022 14:42 IST

Kangana Ranuat: అవును నిజమే.. మహేశ్‌ని బాలీవుడ్‌ భరించలేదు: కంగన

సూపర్‌స్టార్‌ని సపోర్ట్‌ చేసిన బాలీవుడ్‌ తార

ముంబయి: బాలీవుడ్‌ తనని భరించలేదంటూ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై బీటౌన్‌ నటి కంగనా రనౌత్‌ స్పందించారు. సూపర్‌స్టార్‌ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని ఆమె అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ధకడ్‌’ మే 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం తాజాగా ముంబయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన మాట్లాడుతూ..  ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదని.. మహేశ్‌ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరారు.

‘‘మహేశ్‌ మాటల్లో వాస్తవం ఉంది. బాలీవుడ్‌ నిజంగానే ఆయన్ని భరించలేదు. ఎందుకంటే, ఆయనకు ఎంతోమంది ఫిల్మ్‌ మేకర్స్‌ నుంచి అవకాశాలు వచ్చాయి. కానీ, ఆయన తరం నటీనటులందరూ కలిసి టాలీవుడ్‌ని భారతదేశంలోనే నంబర్‌ 1 ఇండస్ట్రీగా మార్చారు. మహేశ్‌కు తన సొంత ఇండస్ట్రీపై ఎంతో గౌరవం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. తన సొంత ఇండస్ట్రీపై ఉన్న గౌరవం, తన అభిమానులపై ఉన్న ప్రేమతోనే ఆయన అలా చెప్పి ఉంటారు. కాబట్టి, ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. అదే విధంగా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలుగు చిత్రపరిశ్రమ ఈ స్థాయికి వచ్చిందనేది అందరూ తప్పకుండా ఒప్పుకోవాల్సిన విషయం. సుమారు 10, 15 ఏళ్ల నుంచి టాలీవుడ్‌ వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు. మనం వాళ్ల నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని కంగన అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని