Iranian vessel: ఇరాన్‌లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్‌కు చేరుకొన్న మత్స్యకారులు..!

ఇరాన్‌లో కాంట్రాక్ట్‌పై పని చేసేందుకు వెళ్లిన మత్స్యకారులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. దీంతో యజమాని పడవతో సహా వారు పారిపోయి భారత్‌ చేరుకొన్నారు. ప్రస్తుతం వారు కోస్టుగార్డ్‌ అదుపులో ఉన్నారు.  

Published : 06 May 2024 19:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరుగురు భారతీయులతో ప్రయాణిస్తున్న ఇరాన్‌కు చెందిన చేపలవేట పడవను కోస్ట్‌గార్డ్‌ అదుపులోకి తీసుకొంది. ఈ మత్స్యకారులు తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఇరాన్‌కు చెందిన సయ్యద్‌ సౌదీ అన్సారీ అనే వ్యక్తి వద్ద కాంట్రాక్టుపై పని చేస్తున్నారు. యజమాని తమను దారుణంగా చూస్తున్నాడని సదరు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కనీస జీవనావసరాలను కూడా తీర్చడం లేదని తెలిపారు. 

ఆ దేశ తీరంలో చేపల వేటకు మార్చి 26 నాటికి అన్సారీ ఇరాన్‌ వీసాలను సంపాదించాడని భారత మత్స్యకారులు వెల్లడించారు. తమ పాస్‌పోర్టులను కూడా అతడు స్వాధీనం చేసుకొన్నట్లు చెబుతున్నారు. దీంతో చేపల వేటకు ఉపయోగించే పడవనే వాడుకొని అక్కడినుంచి తాము తప్పించుకొని భారత్‌కు చేరాలని నిర్ణయించుకొన్నారు. 

ఈ మత్స్యకారులు అక్కడినుంచి పారిపోయి భారత్‌ వస్తుండగా.. మన కోస్టుగార్డ్‌ దళాలు అప్రమత్తమయ్యాయి. తక్షణమే హెలికాప్టర్‌ను పంపించి ఆ ఇరాన్‌ పడవను అడ్డుకొన్నాయి. అందులోని మత్య్సకారులను అదుపులోకి తీసుకొన్నాయి. వారందరినీ ప్రశ్నించేందుకు కొచ్చికి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని