రఫాపై ఇజ్రాయెల్‌ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై ఐడీఎఫ్‌ దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు.

Published : 06 May 2024 18:48 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన తరుణంలో భారీ దాడులకు ఐడీఎఫ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రఫాపై ఇప్పటికే దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. సుమారు లక్ష మంది పాలస్తీనా వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌ దళాలు దాడులు ప్రారంభించడం గమనార్హం.

గాజా దక్షిణ భాగమైన రఫాలో హమాస్‌కు ఇంకా పట్టున్నట్లు ఇజ్రాయెల్‌ భావిస్తోంది. వారి అంతమే లక్ష్యంగా తమ దాడులు ఉంటాయని హెచ్చరిస్తున్న నెతన్యాహూ.. సంధి ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా రఫాపై తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయనే వార్తలు వచ్చాయి. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపులాంటి హమాస్‌ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో భారీ దాడులు చేపడతామని చెప్పిన ఇజ్రాయెల్‌.. పాలస్తీనీయన్లు తరలిపోతున్న సమయంలోనే దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని