Kiara Advani: చరణ్‌ అభిమానులకు గొప్ప అనుభూతి

ఒక సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న అదే జోడీ మరో చిత్రానికి రెడీ అయితే అభిమానులకు పండగే.

Updated : 05 Aug 2023 14:00 IST

క సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న అదే జోడీ మరో చిత్రానికి రెడీ అయితే అభిమానులకు పండగే. ‘వినయ విధేయ రామ’తో ప్రేక్షకులను అలరించిన రామ్‌ చరణ్‌, కియారా అడ్వాణీ మళ్లీ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఎస్‌.శంకర్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం గురించి కియారా మాట్లాడుతూ...‘రెండేళ్లుగా ఈ సినిమా కోసం చిత్రబృందం కష్టపడుతుంది. ఈ ఏడాదిలో చిత్రీకరణను పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌ నాకు మంచి స్నేహితుడు. శంకర్‌ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ఈ ప్రాజెక్టును అద్భుతంగా రూపొందిస్తున్నారు. చరణ్‌ అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేశాం. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారికి ఒక గొప్ప అనుభూతిని కలిగించనుందని చెప్పాలి. తప్పక ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని