shabana: వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది.
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎన్వైఐఫ్ఫ్) ఓ వేడుకను నిర్వహించనుంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్వైఐఫ్ఫ్ తాజాగా వెల్లడించింది. 1974లో ‘అంకుర్’ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన షబానా. ఇన్నేళ్లు చిత్రపరిశ్రమకు అందించిన సేవలకు విశేష ఆదరణ లభించిందని సినీ వర్గాలు తెలిపాయి. భారతీయ అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో షబానా ఈ ఏడాదితో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దీపా మెహతా దర్శకత్వంలో ఈమె నటించిన ‘ఫైర్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేఫథ్యంలో షబానా మాట్లాడుతూ...‘‘ఎన్వైఐఫ్ఫ్’ ప్రారంభమైనప్పటి నుంచి దానితో నాకు మంచి అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్వైఐఫ్ఫ్ సాధించిన పురోగతి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా 50ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఎన్వైఐఫ్ఫ్ ఓ వేడుకలా నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమం మే 31 నుంచి జూన్ 2 వరకూ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భన్సాలీ నిర్మాణంలో మృణాల్ చిత్రం!
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్ ఠాకూర్. కానీ, ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్లీ కొత్త కబురు వినిపించలేదు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కుబేర’ సందడి
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. -
కేన్స్‌లో కన్నప్ప
ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ బృందం సందడి చేసింది. కథానాయకుడు మంచు విష్ణు, నిర్మాత, నటుడు మంచు మోహన్‌బాబు, నృత్య దర్శకుడు ప్రభుదేవా తదితరులు చిత్రోత్సవాలకి హాజరయ్యారు. -
కొత్త ప్రాజెక్టుతో సారా అలీఖాన్..
ఈ మధ్యే ‘ఏ వతన్ మేరే వతన్’, ‘మర్డర్ ముబారక్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్. మరో మూడు సినిమాలతో రోజుల్ని బిజీగా గడుపుతున్న ఈమె ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. -
యంగ్ గ్లోబల్ లీడర్.. భూమి
‘దమ్ లగాకే హైస్సా’, ‘భక్షక్’ లాంటి చిత్రాలతో ఉత్తమ నటిగా నిరూపించుకున్న భూమి పెడ్నేకర్ మరో కొత్త పాత్రలో మెప్పించడానికి సిద్ధమవుతోంది. అయితే ఈసారి తెరపై కాకుండా.. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) యంగ్ గ్లోబల్ లీడర్‌గా కనిపించనుంది. -
జూన్‌లో హరోం హర
ఈ నెల 31న విడుదల కావల్సిన ‘హరోం హర’ వాయిదా పడింది. జూన్ 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత మంగళవారం ప్రకటించారు. -
ఖురేషి అబ్రమ్ మళ్లీ వస్తున్నాడు
మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా ‘లూసిఫర్’. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
కేన్స్ చిత్రోత్సవాల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్
వైవిధ్యమైన కథలకు తెర రూపం ఇచ్చే ఉద్దేశంతో నట జంట రిచా చద్ధా, అలీ ఫజల్ ప్రారంభించిన బ్యానర్.. పుషింగ్ బటన్స్ స్టూడియోస్. ఈ పతాకంపై నిర్మించిన మొదటి చిత్రం ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’. దీంతో సుచీ తలాటీ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. -
పోలీసు హెచ్చరిక
ఏ రోజు నేను వాడిని కలుస్తానో... అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించింది ఓ పోలీసు అధికారిణి. ఇంతకీ ఆమె హెచ్చరిక ఎవరిని ఉద్దేశించో తెలియాలంటే ‘రక్షణ’ చూడాల్సిందే. పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రమిది. -
రెండింతల యాక్షన్‌తో టైగర్..?
ఎన్ని యాక్షన్ చిత్రాలు చేసినా..మళ్లీ కొత్తగానే అనిపిస్తుందంటూ చెప్పే బాలీవుడ్ కథానాయకుడు టైగర్ ష్రాఫ్.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో టైగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. -
బికినీలో రకుల్‌ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం