Aamir Khan: యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్‌ ఖాన్‌

మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్‌ ఖాన్‌ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Published : 01 May 2024 11:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan ) ఎప్పుడూ అభిమానులతో సరదాగా ఉంటారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు.షారుక్‌, సల్మాన్‌లతో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు.

‘యవ్వనంగా కనిపించడం కోసం అందరూ ఏవేవో క్రీములు వాడుతుంటారు. నేను అలాంటి పనులు చేయను. ఏ క్రీములు రాయకపోవడమే నా అందానికి రహస్యం. సల్మాన్‌, షారుక్‌లతో కలిసి సినిమా తీసేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. రెండు రోజుల క్రితం కూడా వాళ్లిద్దరినీ కలిశా. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాం. మన ముగ్గురం కలిసి సినిమా తీయకపోతే అభిమానులు బాధపడతారు. కనీసం ఒక్క చిత్రమైనా కలిసి చేద్దామని చెప్పాను. ఆసక్తికర స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నాం. మంచి కథ దొరికితే కచ్చితంగా కలిసి నటిస్తాం’ అని చెప్పారు. ఇటీవల ముకేశ్‌ అంబానీ ఇంట జరిగిన వేడుకల్లో ఈ బాలీవుడ్‌ ఖాన్స్ త్రయం రామ్‌ చరణ్‌తో కలిసి నాటునాటుకు స్టెప్పేసిన సంగతి తెలిసిందే. దాని గురించి ఆమిర్‌ మాట్లాడుతూ.. ఆ ఈవెంట్‌లో తాను ధరించిన డ్రెస్‌ కూడా సల్మాన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిందేనన్నారు. ఆయన తరచూ స్నేహితులకు బహుమతులు పంపుతుంటారని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ తర్వాత  కొన్ని రోజులు విరామం తీసుకున్న ఆమిర్‌ ప్రస్తుతం ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలో రానున్న ‘సితారే జమీన్‌ పర్‌’లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుందని ఓ సందర్భంలో వెల్లడించారు. దీనితో పాటు ‘లాహోర్‌: 1947’లో నటించేందుకు సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఇందులో సన్నీదేవోల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని