Sitara: మహేశ్‌ తనయ మంచి మనసు.. ఫిదా అవుతోన్న నెటిజన్లు

పేదలు, చిన్నారుల కోసం నటుడు మహేశ్‌బాబు (Mahesh babu) తరచూ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మహేశ్‌ అడుగుజాడల్లోనే ఆయన కుమార్తె సితార సైతం నడుస్తున్నారు.

Updated : 01 Oct 2023 14:13 IST

హైదరాబాద్‌: పేదలకు చేతనైనంత సాయం చేస్తూ ఇప్పటికే పలు సందర్భాల్లో గొప్ప మనసు చాటుకున్నారు నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) ముద్దుల కుమార్తె సితార (Sitara). తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని ఆమె చూపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

దసరా వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేశ్‌ సతీమణి నమత్ర, కుమార్తె సితార పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు షాపింగ్‌ మాల్‌ వారు పలువురు పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా.. బహుమతి అందుకోవడం కోసం స్టేజ్‌పైకి ఎక్కడానికి ఇబ్బందిపడిన ఓ వృద్ధురాలికి సితార సాయం చేశారు. చేయి పట్టుకుని ఆమెను వేదికపైకి తీసుకువచ్చారు. అనంతరం, అక్కడి వారందరితో నవ్వుతూ మాట్లాడారు. ఫొటోలు దిగారు. సితార మంచి మనసుకు మురిసిపోయిన ఓ వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ డాటర్‌’ అంటూ వాళ్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Kiran Abbavaram: మాటిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తా: కిరణ్‌ అబ్బవరం

ప్రస్తుతం స్కూల్‌ విద్యను అభ్యసిస్తున్నారు సితార. ఇటీవల ఆమె ఓ నగల దుకాణానికి వాణిజ్య ప్రకటనకర్తగా వ్యవహరించారు. ఈ యాడ్‌ కోసం తాను అందుకొన్న మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఇచ్చేసినట్లు ఆమె ఇటీవల చెప్పారు. అలాగే, ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు.. అనాథ ఆడపిల్లలకు సైకిళ్లను బహుమతిగా అందించారు. తనకు సినీ పరిశ్రమ అంటే ఇష్టమని, భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని