Kiran Abbavaram: మాటిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తా: కిరణ్‌ అబ్బవరం

తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). వచ్చే ఏడాదిలోపు తాను అద్భుతమైన చిత్రాల్లో నటించి గర్వపడేలా చేస్తానని మాటిచ్చారు.

Published : 01 Oct 2023 10:15 IST

హైదరాబాద్‌: కిరణ్‌ అబ్బవరం - నేహాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan). రత్నం కృష్ణ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న కిరణ్‌ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

‘‘జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ డబ్బు, సక్సెస్‌, ఫేమ్‌తోపాటు మంచి వ్యక్తులను సైతం కలుస్తూ ఉండాలనేది నేను ఎక్కువగా నమ్ముతుంటా. అదే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది. ఈ సినిమా వల్ల ఎంతో మంది మంచి మనసున్న వ్యక్తులను కలిశా. నా దర్శకుడు కృష్ణ, నటీనటులు.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా నా దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడు లాంటివారు. ఇదొక పూర్తి వినోదాత్మక చిత్రం. నా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. గడిచిన మూడేళ్లలో కెరీర్‌ పరంగా నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. కొన్ని కారణాల వల్ల గొప్ప చిత్రాల్లో నటించలేకపోయా. ఇప్పుడు మాటిస్తున్నా.. వచ్చే ఏడాది తప్పకుండా మీరందరూ గర్వపడేలా చేస్తా. అద్భుతమైన చిత్రాలను మీకు అందిస్తా’’ అని ఆయన అన్నారు.

Social Look: సమంత సైకిల్‌ రైడ్‌.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్‌ డ్రెస్‌లో అనన్య

‘మీటర్‌’ తర్వాత కిరణ్‌ అబ్బవరం నటిస్తోన్న చిత్రమిది. ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమైంది. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష, అజయ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని