బడా డైరెక్టర్‌ని కలిసిన నాగచైతన్య.. పెద్ద ప్రాజెక్టే అంటున్నా ఫ్యాన్స్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటుడిగా తన ఫేమ్‌ను విస్తరించుకుంటున్నారు. త్వరలో విడుదల కానున్న అమీర్‌ ఖాన్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’(Laal Singh Chaddha)లో కీలక పాత్ర పోషించిన చైతూ, ఒక బహుభాష వెబ్‌ సిరీస్‌ ‘దూత’(Dootha)లోనూ నటిస్తున్నారు. అయితే ఇటీవల ముంబయి వెళ్లిన ఈయన...

Published : 10 Aug 2022 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటుడిగా తన ఫేమ్‌ను విస్తరించుకుంటున్నారు. త్వరలో విడుదల కానున్న అమీర్‌ ఖాన్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్దా’(Laal Singh Chaddha)లో కీలక పాత్ర పోషించిన చైతూ, ఒక బహుభాష వెబ్‌ సిరీస్‌ ‘దూత’(Dootha)లోనూ నటిస్తున్నారు. అయితే ఇటీవల ముంబయి వెళ్లిన ఈయన, ఒక బాలీవుడ్‌ డైరెక్టర్‌ని కలిసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేవదాస్‌, బాజీరావు మస్తానీ, పద్మావత్‌, గంగూభాయి కథియావాడీ లాంటివిజయవంతమైన చిత్రాల దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ (Sanjay Leela Bhansali)ని నాగచైతన్య కలిసి చాలాసేపు చర్చించినట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఆయన నివాసం వద్ద చైతూ కారెక్కుతున్న వీడియోలు, హిందీ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలలో అక్కడ మీడియా చైతూను పలకరించగా, నవ్వుతూ కారెక్కి వెళ్లిపోయిన దృశ్యాలు కనపడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భేటీ వెనుక ఏదో పెద్ద ప్రాజెక్టే ఉంటుందని నెటిజన్లు, చైతూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే భన్సాలీని గత మార్చి నెలలో మన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) కూడా కలిసారు. ఇప్పుడు చైతూ కలవడం చూస్తుంటే ఆ బడా డైరెక్టర్‌ తెలుగు హీరోలపై దృష్టి పెట్టారా?అనే కోణం దిశగా బాలీవుడ్‌ మీడియా పలు కథనాలను ప్రసారం చేస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘థాంక్యూ’ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని