
Katrina Kaif: వెండి తెరపై.. పెళ్లి దుస్తుల్లో మెరిసిన ‘మల్లీశ్వరి’!
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు. డిసెంబరు 9న మూడుముళ్ల బంధంతో సంసార సాగరంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి దుస్తుల్లో ఈ జోడీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఎలాంటి డ్రెస్సుల్లో మెరుస్తారోనని ఆరా తీస్తున్నారు. అప్పటి వరకూ వేచి చూడలేని కొందరు అభిమానులైతే.. ఏకంగా కత్రినా వెండితెరపై వధువుగా మెరిసిన చిత్రాల్ని గుర్తుచేసుకుంటున్నారు. ‘హమ్ దీవానా కర్ గయే’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘బార్ బార్ దేఖో’ తదితర చిత్రాల్లో కత్రినా పెళ్లి దుస్తుల్లో కనిపించింది. కళ్లు మిరుమిట్లుగొలిపే డ్రెస్సుల్లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఆ దృశ్యాల్ని మీరూ చూసేయండి!
కత్రినా ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘అల్లరి పిడుగు’లోనూ సందడి చేసిన విషయం తెలిసిందే.
► Read latest Cinema News and Telugu News