Vikram Vedha: వేగంగా ‘విక్రమ్ వేద’
హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్ వేద’. పుష్కర్ అండ్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. లక్నోలో జరుగుతున్న ఈ సినిమా
హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విక్రమ్ వేద’. పుష్కర్ అండ్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. లక్నోలో జరుగుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకులతో సైఫ్ అలీఖాన్ ఉన్న ఫొటోను చిత్రబృందం పంచుకుంది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. హృతిక్, సైఫ్లను ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు కనువిందులా ఉంటుంది. వచ్చే ఏడాదిలో రానున్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో మా చిత్రం కచ్చితంగా ఉంటుంది’’అని చెప్పారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు