icon icon icon
icon icon icon

YS Sharmila: ‘నవ సందేహాల’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు.

Updated : 02 May 2024 10:38 IST

అమరావతి: ‘నవ సందేహాల’ పేరుతో సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో ‘నవ సందేహాల’కు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ‘‘2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. ఏమైంది? ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు? 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఏం చేశారు? గ్రూప్‌-2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకు? వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? 23 వేలతో మెగా డీఎస్సీ అని 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు? నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారంటే మీ వైఫల్యం కాదా? యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా?’’ అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img