ఆ రోజుల్లో ఏం జరిగిందంటే!

తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక యామి గౌతమ్‌. ఆమె యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తీవ్రమైన గాయాలతో ఎలా బాధపడిందో, ఆ బాధల్ని ఫిట్‌నెస్‌తో ద్వారా ఎలా తగ్గించుకుందో తెలిపింది.

Published : 03 Mar 2021 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక యామి గౌతమ్‌. ఆమె యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో తీవ్రమైన గాయాలతో ఎలా బాధపడిందో, ఆ బాధల్ని ఫిట్‌నెస్‌తో ద్వారా ఎలా తగ్గించుకుందో తెలిపింది. తాజాగా ఆమె రహదారి భద్రత గురించి స్సందిస్తూ...‘‘యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో చండీగఢ్‌లో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నా. అదే సమయంలో నా ముందున్న ఓ వ్యక్తి రాంగ్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కిందపడిపోయా. దాంతో అతను నన్ను పట్టించుకోకుండా అక్కడ నుంచి పారిపోయాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం నేను ఆసుపత్రిలో చేరేందుకు సహాయం చేశాడు.  ఆ సమయంలో నా శరీరం బయట దెబ్బలు తగల్లేదు. కానీ మెడపై గాయాలయ్యాయి. డాక్టర్‌ మాత్రం ఎటువంటి పనిచేయకూడదంటూ సూచించారు. అప్పుడు నేను ఐఏఎస్‌ కావాలని ప్రయత్నం చేస్తున్నా. ఒక్క ఐదు అంగుళాలు ముందుకేసినా నా కాళ్లో నొప్పి వచ్చేది. తిరిగి యధా స్థితికి చేరుకోవడానికి ‘యోగా’ నాకెంతో మేలు చేసింది. మనం రహదారిపై  ప్రయాణం చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణిస్తూ ముందుకెళ్లాలని’’ తెలిపింది. యామి బాలీవుడ్‌లో ‘విక్కీ డోనర్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్‌’లాంటి చిత్రాల్లో నటించింది ఆకట్టుకుంది. ప్రస్తుతం యామి,  సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌లతో కలిసి ‘బూత్‌ పోలీస్‌’లో నటిస్తోంది. ‘దాస్వి’ అనే చిత్రంలో ఐపీయస్‌ అధికారిగా నటిస్తోంది. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కతున్న ఇందులో అభిషేక్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని