చంద్రబాబు, లోకేశ్‌కు డాక్టర్ రవి వేమూరి శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెదేపా, జనసేన, బీజేపీ (ఎన్డీయే) కూటమి ఘన విజయం సాధించడం పట్ల ఎన్‌ఆర్‌ఐ తెదేపా అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి సంతోషం వ్యక్తం చేశారు.

Published : 05 Jun 2024 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా (ఎన్డీయే) కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి గెలుపు కోసం విదేశాల నుంచి ప్రవాసాంధ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెదేపా విజయంలో ఎన్‌ఆర్‌ఐ అభిమానులు తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి విజయంపై ఎన్‌ఆర్‌ఐ తెదేపా అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి సంతోషం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఐదేళ్లుగా తెదేపా విజయానికి ఎన్‌ఆర్‌ఐలు పడిన కష్టం వృథా కాలేదని, ఈ విజయంలో వారి పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా నాయకులు రాధాకృష్ణ రవి, బుచ్చి రాంప్రసాద్, సాగర్ దొడ్డపనేని, డీవీ రావు, మల్లిక్ మేదరమెట్ల, శేషుబాబు, రాజశేఖర్ చప్పిడిలకు డాక్టర్‌ రవి వేమూరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి గెలుపు కోసం కష్టపడిన వారందరి పేర్లు రాసే ఆస్కారం లేనందున వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు. ఎన్డీయే కూటమి విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెదేపా అభిమానులు ఒక పండుగలా నిర్వహించకున్నారని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రవాసాంధ్రుల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తాము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని