ఆలూ కృత్రిమ కొరత వెనుక తృణమూల్‌: భాజపా

పశ్చిమబెంగాల్‌లో బంగాళాదుంపల(ఆలూ) కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీని వెనుక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని భాజపా ఆరోపించింది. అకస్మాత్తుగా బంగాళా దుంపల ..........

Published : 29 Nov 2020 20:42 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బంగాళాదుంపల(ఆలూ) కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీని వెనుక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని భాజపా ఆరోపించింది. అకస్మాత్తుగా బంగాళా దుంపల ధరలు పెరగడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కిలో బంగాళా దుంపల ధర రూ.40లుగా ఉందని, సామాన్యుడికి ఎంతో కష్టంగా మారిందని , వారి జేబులకు చిల్లుపెట్టేదిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగాళా దుంపల ధరలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. అధికార పార్టీ పెంచి పోషిస్తున్న వారే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన సభ్యులే అసంతృప్తితో ఉన్నారన్నారు. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)ను నియమించుకోవడాన్ని కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్నారు. పీకే హఠావో.. టీఎంసీ బచావో వంటి నానాదాలు చేస్తున్నారని దిలీప్‌ ఘోష్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని