Chandrababu: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ పూర్తిగా కక్షపూరితమే: చంద్రబాబు

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ పూర్తిగా కక్షపూరితమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైకాపా ప్రభుత్వం..

Updated : 10 May 2022 15:14 IST

అమరావతి: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ పూర్తిగా కక్షపూరితమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైకాపా ప్రభుత్వం.. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన్ను అరెస్ట్‌ చేసిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. నారాయణ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాస్‌ కాపీయింగ్‌, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని చంద్రబాబు నిలదీశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా.. విచారణ చేపట్టకుండా, ఆధారాలు లేకుండా నేరుగా ఆయన్ను అరెస్ట్‌ చేయడం కక్ష పూరిత చర్య కాదా? అని మండిపడ్డారు.

అలా చేయడం జగన్‌ అండ్‌ కో ట్రేడ్‌ మార్క్‌: లోకేశ్‌

చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్‌ అండ్‌ కో ట్రేడ్‌ మార్క్‌ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. టెన్త్‌ పరీక్ష పత్రాల లీక్‌పై సీఎం జగన్‌, మంత్రి బొత్స విరుద్ధ ప్రకటనలను ప్రజలంతా చూశారని.. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకుని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నారాయణను అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. సంబంధం లేని కేసులో ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని