Telangana Elections: సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Updated : 05 Nov 2023 13:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. మొదటి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  కాంగ్రెస్‌ ప్రతిపాదించిన విధంగా మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని సీపీఎం కోరింది. అయితే హస్తం పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించే అవకాశముంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు. 

అభ్యర్థులు వీరే..

  • భద్రాచలం (ఎస్టీ) - కారం పుల్లయ్య

  • అశ్వారావుపేట (ఎస్టీ) - పిట్టల అర్జున్‌

  • పాలేరు - తమ్మినేని వీరభద్రం

  • మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్‌

  • వైరా (ఎస్టీ) - భూక్యా వీరభద్రం

  • ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్‌

  • సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి

  • మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

  • నకిరేకల్‌ (ఎస్సీ) - చినవెంకులు

  • భువనగిరి - కొండమడుగు నర్సింహ

  • జనగాం - మోకు కనకారెడ్డి

  • ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

  • పటాన్‌చెరు - జె. మల్లికార్జున్‌

  • ముషీరాబాద్‌ - ఎం. దశరథ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని