అచ్చెన్న అరెస్టు సందేహాలకు తావిస్తోంది:జనసేన

అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల....

Updated : 12 Jun 2020 14:21 IST

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేక రాజకీయ కక్ష సాధింపా? అనే విషయంలో వైకాపా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అచ్చెన్న అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తోందన్నారు. ఈఎస్‌ఐలో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందని నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని