భాజపాను వైకాపాకు తాకట్టు పెట్టారు

‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆస్తులను పెంచుకోవడానికి పార్టీని వైకాపాకు తాకట్టు పెట్టారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గమనే మమ్మల్ని కార్యవర్గ సమావేశాలకూ పిలవడం లేదు’ అని ఆ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కె.సైదారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 25 Jan 2023 04:43 IST

సోము వీర్రాజుపై కన్నా వర్గీయుల ఆగ్రహం
నిరసనగా పెదకూరపాడులో రాజీనామాలు

క్రోసూరు, న్యూస్‌టుడే: ‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆస్తులను పెంచుకోవడానికి పార్టీని వైకాపాకు తాకట్టు పెట్టారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గమనే మమ్మల్ని కార్యవర్గ సమావేశాలకూ పిలవడం లేదు’ అని ఆ పార్టీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు కె.సైదారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు మంగళవారం క్రోసూరులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సైదారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చినా, 10శాతం రిజర్వేషన్లో అగ్రవర్ణాలకు 5శాతమే అమలు చేస్తామన్నా సోము వీర్రాజు ఖండించకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆయన నిరంకుశ వైఖరివల్ల పార్టీకి చేటు జరుగుతోందని ఆరోపించారు. నియోజకవర్గ బాధ్యుడు గంధం కోటేశ్వరావు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా డబ్బున్న వాళ్లకు, స్థానికేతరులకు పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కన్నా వర్గమని మాకు ఏ విషయం చెప్పడం లేదని మండిపడ్డారు. వీర్రాజు తప్పుడు నిర్ణయాలను ప్రజలకు, జాతీయ నాయకత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు పమిడి వెంకట్రామయ్య, 5 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని