Andhra News: పలమనేరులో అదనంగా మరో రెండు షరతులు

నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విధించిన వాటికి అదనంగా.. పలమనేరు నియోజకవర్గంలో మరో రెండు ఆంక్షలను పాటించాలని పోలీసులు ఆదేశించారు.

Updated : 27 Jan 2023 06:19 IST

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విధించిన వాటికి అదనంగా.. పలమనేరు నియోజకవర్గంలో మరో రెండు ఆంక్షలను పాటించాలని పోలీసులు ఆదేశించారు. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు పలమనేరు నియోజకవర్గంలో నిర్వహించే పాదయాత్ర, బహిరంగ సభలకు అనుమతులివ్వాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని కోరారు. చెన్నై- బెంగళూరు మార్గంలోని మొగిలి నుంచి బంగారుపాళ్యం వరకు బైక్‌ ర్యాలీకి అనుమతులు కోరగా నిరాకరించారు. పలమనేరు పట్టణం, బంగారుపాళ్యం నాలుగు రోడ్ల కూడలిలో తలపెట్టిన బహిరంగసభకూ అనుమతులు నిరాకరిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ రెండు కొత్త నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవ్వడానికే అనుమతి ఇచ్చారు. బహిరంగ సభ నిర్వహించాలంటే సరైన ప్రదేశాన్ని గుర్తించి పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 4 ఉదయం 9.50 గంటల వరకే ఈ అనుమతులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని