2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు.. అసలు సిసలైన దేవుడి స్క్రిప్ట్: తెదేపా
‘‘23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెదేపా... 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో... 23 స్థానాలకే పరిమితమైంది. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’
పంచుమర్తి అనురాధ గెలుపు
‘‘23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెదేపా... 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో... 23 స్థానాలకే పరిమితమైంది. దేవుడు ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాస్తాడో అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’’
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు ఓ ఏడాది పాటు తెదేపాను ఎద్దేవా చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చేసిన వ్యాఖ్యలివి.
మరి ఇప్పుడు... అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యింది. 2023వ సంవత్సరం.. మార్చి 23వ తేదీన విడుదలైన ఫలితాల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లు దక్కించుకుని మరీ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు.. వైకాపాలో చేరారు. దీంతో తెదేపా బలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే గురువారం విడుదలైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా అభ్యర్థి అనురాధ 23 ఓట్లు సాధించారు. తెదేపా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైకాపా లాక్కోగా... అదే వైకాపాలో అసంతృప్తిగా ఉన్న వారిలో నలుగురు తెదేపా అభ్యర్థినికి ఓటు వేయటంతో అనురాధ 23 ఓట్లు సాధించగలిగారు. వాస్తవంగా తెదేపా బలం ఎంతో.. ఈ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి. అంతే కాదు.. 23.03.2023నే ఆ ఫలితాలు వచ్చాయని తెదేపా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
- ఈనాడు,అమరావతి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్