క్యాంపస్‌లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్‌ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్‌

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం తెలిపింది.

Published : 06 May 2024 03:30 IST

దిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం తెలిపింది. రాష్ట్ర పోలీసులు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘రోహిత్‌ మృతి భాజపా ‘దళిత వ్యతిరేక ఆలోచన’ను బయటపెట్టింది. రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ క్లిష్ట సమయంలో రోహిత్‌ కుటుంబానికి అండగా నిలిచింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదిక 2023 జూన్‌లో రూపొందించింది. ఆ దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయి. కేంద్రంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్యాంపస్‌లలో కుల, మతపరమైన వేధింపుల సమస్య పరిష్కారానికి.. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం నుంచి వచ్చిన ఏ విద్యార్థి కూడా మళ్లీ రోహిత్‌ లాంటి పరిస్థితి ఎదుర్కోకుండా రోహిత్‌ వేముల చట్టం చేస్తాం’ అని వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని