పరిశ్రమల అమ్మకమే భాజపా విధానం

పరిశ్రమలను విక్రయించడమే భాజపా విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో శుక్రవారం

Updated : 02 Jul 2022 13:07 IST

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం (ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: పరిశ్రమలను విక్రయించడమే భాజపా విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన విధానాలను ఇప్పుడు భాజపా అనుసరిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో ర్యాంకు రావటాన్ని ప్రజలు గర్వంగా భావిస్తున్నారని, రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలు పొందుతున్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వాణిజ్య విభాగం ఈ ర్యాంకును ఇచ్చిందని తెలిపారు. దీనిపై భాజపా నాయకులు విమర్శలు చేసి సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు భాజపా ‘ఈజ్‌ ఆఫ్‌ సెల్లింగ్‌’ విధానంలో ఉందని విమర్శిస్తూ, 32 మంది ప్రాణత్యాగంతో సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీనిపై ఆ నాయకులు ఎందుకు మాట్లాడరని, 500 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం దీక్షలు చేస్తుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆత్మకూరు ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయిన సంగతి, తిరుపతి ఉపఎన్నికలో తెదేపా సాయంతో అభ్యర్థిని పోటీలో పెట్టి పరువు పోగొట్టుకున్నది మరిచారా? అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని