జాతీయ కార్యవర్గంలో ఏం చర్చిద్దాం?

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండా, తీర్మానాలపై కమలదళపతి కసరత్తు మొదలుపెట్టారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి

Published : 02 Jul 2022 06:15 IST

ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండా, తీర్మానాలపై కమలదళపతి కసరత్తు మొదలుపెట్టారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలపై మాట్లాడారు. శనివారం ఉదయం జరిగే పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ఎజెండాను ఖరారు చేయాలనుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి బీఎల్‌ సంతోష్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. శనివారం ఉదయం 8.30కి అన్ని రాష్ట్రాల పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జులతో నడ్డా సమావేశం కానున్నారు. ఆ తర్వాత జాతీయ ప్రధానకార్యదర్శులతో మరోసారి భేటీ అవుతారు. అనంతరం జాతీయ ప్రధాన పదాధికారుల సమవేశం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని