బెస్త సామాజికవర్గంపై నిఘా!

కడపలో జరిగిన గ్రేటర్‌ రాయలసీమ బెస్త గర్జన, విజయవాడలో నిర్వహించిన గ్రేటర్‌ రాయలసీమ బెస్తల రాజ్యాధికార దీక్షలకు వైకాపాలోని బెస్త సామాజికవర్గ నేతలే నాయకత్వం

Published : 24 Sep 2022 05:52 IST

ఈనాడు, అమరావతి: కడపలో జరిగిన గ్రేటర్‌ రాయలసీమ బెస్త గర్జన, విజయవాడలో నిర్వహించిన గ్రేటర్‌ రాయలసీమ బెస్తల రాజ్యాధికార దీక్షలకు వైకాపాలోని బెస్త సామాజికవర్గ నేతలే నాయకత్వం వహించడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే విచారణకు నిఘా విభాగం(ఇంటెలిజెన్స్‌) అధికారులను రంగంలోకి దింపింది. ఈ వేదికల్లో పాల్గొన్న వారు కేవలం ప్రభుత్వాన్నే విమర్శించారా? లేదా ఇతర పార్టీలపైనా వ్యాఖ్యలు చేశారా? ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలేంటి అనే వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో జిల్లా, నియోజకవర్గాల వారీగా బెస్త సామాజికవర్గ జనాభా ఎంత ఉంది? ఉప కులాల జనాభా ఎంతో లెక్కలు తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సామాజికవర్గానికి చెందిన వారిలో నియోజకవర్గ స్థాయి నాయకులు, వారి పార్టీ విషయాలపై కూడా దృష్టి పెట్టి మున్ముందు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నారో ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని